Mahaa Daily Exclusive

  రామప్ప ఆలయాన్ని సందర్శించిన – స్మితా సబర్వాల్

Share

ములుగు, మహా: రామప్ప పర్యాటక ప్రాంత అభివృద్ధి ప్రసాద్, సాస్కి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ సెక్రెటరీ స్మితా సబర్వాల్ అన్నారు.
సోమవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయాన్ని పర్యాటక సాంస్కృతిక యువజనుల ఆర్కియాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ చేరుకోగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పూల మొక్కను అందచేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయం పరిధిలో జరుగుతున్న ప్రసాద్, సాస్కి ప్రాజెక్టుల పనుల గురించి కలెక్టర్ వివరించారు. రామప్ప దేవాలయానికి విచ్చేసిన స్మితా సబర్వాల్ కు దేవాలయ వేద పండితులు సంప్రదాయాల వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె రుద్రేశ్వరుడినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆలయ మండపంలోను పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ప్రసాద్ స్కీం ద్వారా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పనులను పర్యవేక్షించి, రామప్ప హరిత కాటేజ్ లను సందర్శించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రామప్ప టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ లో భాగంగా గత సంవత్సరం రూ. 60 కోట్లు ప్రసాద్ స్కీమ్ లో మంజూరైన పనులు, ఈ సంవత్సరం సాస్కి స్కీం ద్వారా రూ. 73 కోట్ల నిధులు మంజూరైన సందర్భంలో రామప్ప పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటే ఎక్కువ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలని సలహాలు సూచనలు చేశారు. కాంట్రాక్టర్స్ పిలిచి బాగా చేస్తున్నారనీ, నిర్ణిత సమయంలో పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. రామప్ప టెంపుల్ లో సౌండ్ అండ్ లైట్ షో గురించి ఆర్కే లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించి ఏ విధంగా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయాలో, ఏప్పటివరకు చేస్తారనే విషయాలను చర్చించారు. అదేవిధంగా టెంపుల్ లోని కళ్యాణ మండపం పనులను పరిశీలించారు. తొందరగా కళ్యాణ మండపం పనులు పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని కోరారు. వచ్చిన పర్యాటకులకు ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉన్నదని భావం రాకుండా తొందరగా ఆ కళ్యాణ మండపాన్ని పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లక్ష్మీ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీర్స్ జనరల్ మేనేజర్ మరియు ప్రాజెక్టు కన్సల్టెంట్స్ సత్యనారాయణమూర్తి, క్షేత్ర కన్సల్టెన్సీ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు డాక్టర్ హెచ్ ఆర్ దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, డాక్టర్ రోహిణి పాండే, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, ఎం నవీన్ కుమార్, తెలంగాణ హెరిటేజ్ వరంగల్ సబ్ సర్కిల్ ఇంచార్జి, రాములు నాయక్, డిప్యూటీ డైరెక్టర్ మల్లు నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ వరంగల్ నర్సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్), ఆర్డీఓ వెంకటేష్ , పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీర్స్ డీఈ ధనరాజ్, పర్యాటక శాఖ తరపున డాక్టర్ కుసుమ సూర్య కిరణ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్, రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నా

Latest