Mahaa Daily Exclusive

  తిరుమల శ్రీవారి భక్తులకు దూసుకెళ్లిన 108 వాహనం.. ఇద్దరి మృతి, మరో ముగ్గురికి గాయాలు…!

Share

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం నరిశింగాపురం వద్ద కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్‌ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. బాధితులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందినవారుగా గుర్తించారు. అంబులెన్స్‌ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.

Latest