రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆదివారం నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం 4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన వివరించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 గంటల్లోగా వారి ఆకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా, రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ. 6,083.69 కోట్ల వరకు జమ చేసినట్లు ఆయన చెప్పారు. దీంతో రైతులు కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందడిని తీసుకువచ్చిందన్నారు.
Post Views: 139






