వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భక్తులకు పోటెత్తారు. వేకువజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. జిల్లాలలోని ప్రముఖ ప్రాచీన ప్రసిద్ధిగాంచిన వైష్ణవ ఆలయాలు ఉత్తర ద్వారాన్ని వచ్చి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గోవింద నామాలతో ఆలయాలు దద్దరిల్లాయి. ప్రత్యేకంగా గోవింద స్వాముల ప్రత్యేక దర్శనం కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తూర్పు నియోజకవర్గంలోని శ్రీ గోవిందరాజుల స్వామి గోవిందాద్రి గుట్ట, బట్టల బజార్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గీత మందిర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గణేష్ నగర్, డాక్టర్స్ కాలనీ, గోపాల్ పూర్ రోడ్డు, తదితర శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గీత మందిర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ లతో భక్తులకు కనువిందు చేశాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజకీయనేతలు ముఖ్య నాయకులు ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.







