ప్రముఖ హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు ఆ పోస్టులో రాసుకొచ్చారు. భగవంతుడి దయ అనంతమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు జోడించారు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఎస్ఎస్ఎంబి29 లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల చాలా వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారంటూ నెట్టింట పలు చర్చలు కూడా జరిగాయి. ఆ సినిమాను ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు సినీ అభిమానులు ఆ పోస్టును చూసి కామెంట్లను పెడుతున్నారు
Post Views: 31







