Mahaa Daily Exclusive

  స్వర్ణాంధ్ర 2047 లక్ష్యసాధన దిశగా ముందుకు పేదరిక రహిత సమాజమే ధ్యేయం – కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్

Share

స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించి జిల్లాలో అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కడప పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన జండా ఆవిష్కరణ చేసి గౌరవం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక రహిత సమాజమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వము “జీరో పేదరికం” సాధాన కోసం పలు సమగ్ర వ్యూహాత్మక కార్యక్రమాలతో స్వర్ణాంధ్ర విజన్ లో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. జిల్లాలో అధిక వృద్ది పెరుగుదలకు ముఖ్యమైన “గ్రోత్ ఇంజన్” లు ఉద్యానవన రంగము, ఇంధన రంగము, పర్యాటకము, తయారి రంగము వున్నాయని, రాబోవు 5 సంవత్సరములకు జిల్లా వృద్ది రేటును ప్రతి సంవత్సరమ 15% వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో పెన్నా బేసిన్లో తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ క్రిష్ణానది మిగులు వరద జలాల ద్వారా జిల్లాలోని చిన్న, మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని 82,193 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించామని, ప్రాజెక్టు కాల్వల నిర్వహణ, నీటి నియంత్రణ పనులు, ఎత్తిపోతల పథకాలు నిర్మించడం, వాగులు-వంకల అనుసంధానం, ఆయకట్టు, నూతన చెక్ డ్యాంల నిర్మాణం వంటి పనుల ద్వారా జిల్లాలో మరింత ఆయకట్టు స్థిరీకరణ కోసం జలవనరుల శాఖ కృషి చేస్తుందన్నారు. జిల్లా పారిశ్రామిక ప్రగతిలో సిమెంట్ కర్మాగారాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని, జూన్, 2024 నుండి ఇప్పటివరకు 74 పరిశ్రమలకు రూ.10.99 కోట్ల పారిశ్రామిక రాయితీ నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే పిఎం విశ్వకర్మ పథకం క్రింద 21,184 మంది చేతివృత్తి పనివాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇప్పించి 7,312 మందికి బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో పరిశ్రమల స్థాపన కొరకు 39 పారిశ్రామిక వాడలను స్థాపించడం జరిగిందని, అందుకోసం 11,358 ఎకరాల భూమిని సేకరించడమైందన్నారు. అందులో భాగంగా వివిధ పారిశ్రామిక వాడల్లో 3293 ఎకరాల భూమిని వివిధ రకాల పరిశ్రమలకు కేటాయించగా, పెద్ద పెద్ద పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు, మెగా పారిశ్రామికవాడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా కొప్పర్తి (నార్త్) లో 3155 ఎకరాలలో 738 కోట్ల రూపాయలతో మెగా ఇండస్ట్రీయల్ హబ్ను అలాగే కొప్పర్తి (సౌత్) లో 2,596 ఎకరాలలో వైజాగ్-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడారును అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించడమైనదన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు కూడా ఆయా శాఖల ప్రగతిని కళ్ళ కట్టినట్టు చూపాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇతర జిల్లా అధికారులు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు