కడప జిల్లాలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ వెలుగు చూసింది. ఏం చేంజర్ కావాలంటే 21 కాదని 50 50 సీట్లు కోరి ఉండాల్సిందని పేర్కొంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఇదంతా ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో జనసేనను ఉద్దేశిస్తూ వైసిపి క్యాడర్ ఏర్పాటు చేసింది అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవలే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న వాదన తెరపై వచ్చిన సందర్భంలో జనసేన క్యాడర్ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే … పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినిపించాయి. ఈ పరిస్థితుల్లో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని, కూటమిగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని చర్చించిన నిర్ణయాలను మాత్రమే బహిరంగంగా చెప్పాలంటూ టిడిపి అధిష్టానం గట్టి హెచ్చరికల్ని జారీ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఇలా టిడిపి వ్యాఖ్యలను గట్టిగా ఎదుర్కోవాలంటే జనసేన పోటీ చేసిన 21 సీట్లు కాదని ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునే సందర్భంలో 50 స్థానాలు కోరి ఉండాల్సిందని అర్థం వచ్చేలా ఇప్పుడు ఫ్లెక్సీలు వెలుగులోకి రావడం చర్చినీయాంశంగా మారింది. వాస్తవానికి ఎన్నికల ముందు టిడిపి తో పొత్తు పెట్టుకున్న సమయంలో జనసేన 50 సీట్లు కోరాలని సొంత క్యాడర్ నుంచి ఒత్తిడి వచ్చినా… సీట్లు ముఖ్యం కాదు గెలుపు ముఖ్యమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 సీట్లతో సరిపెట్టుకున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 సీట్లలోను జనసేన గెలవడం పెద్ద సంచలనం అయ్యింది. అధికారంలోకి వచ్చాక పరిస్థితి సానుకూలంగానే సాగిన గత కొద్ది రోజులుగా మాత్రం జనసేన టిడిపి క్యాడర్ మధ్య రకరకాల వాదనలు వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు తెరపైకి వచ్చాక మాత్రం మీరు పార్టీల మధ్య పరిస్థితి కొంత తేడాగానే కనిపిస్తుంది అన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఓవైపు డిప్యూటీ సీఎం పదవి పేరుతో అగ్గిరాజేస్తే కొత్తగా చంద్రబాబు నారా లోకేష్ దావోస్ పర్యటన మరో కొత్త వివాదానికి తేర్లైపోయినట్టుంది డిప్యూటీ సీఎం పోదాల ఉన్న పవన్ కళ్యాణ్ వదిలేసి మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను సీఎం చంద్రబాబు దావోసుకో వెంటబెట్టుకొని వెళ్లడం ఏంటని ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి ఇప్పుడు కడపలో వెలిసిన ఫ్లెక్సీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గేమ్ చేంజ్ కావాలంటే 21 కాదు 50 అడిగి ఉండాల్సిందని ప్రస్తావించారు. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్లు దావోస్ వెళ్లారని, అక్కడ వాళ్లను పట్టించుకునే నాధుడు లేదన్నారు. కనీసం మీరు వెళ్లినా నాలుగు కంపెనీలు వచ్చేవంటూ అందులో ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నా మనకు మంచి పేరు ఉంటుందని, లేకపోతే ఆ దరిద్రం అంతా మన నెత్తికి చుట్టుకుందని, దీన్ని తట్టుకోలేక పోతున్నామన్నా అని రాసి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ ఫ్లెక్సీకి ధీటుగా వైసీపీ నుంచి జగన్ పేరిట ఆ పక్కనే మరొకటి వెలిసింది. జగన్ బ్రాండ్ అంటే ఏందో తెలుసునా మీకు అంటూ కాసింత రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి ఫ్యాన్ పార్టీ శ్రేణులు. వైసీపీ కార్యకర్త అంటేనే ఒక బ్రాండ్ అని, కూటమిని చీల్చాలనేది ఉండదు.. మాకు స్వలాభం అస్సలు ఉండదని ప్రస్తావించారు. లీడర్లు వస్తూంటారు.. పోతుంటారు., పార్టీని నడిపించేది మా లాంటి కరుడు కట్టిన కార్యకర్తలే మా జగనన్న ఆస్తి.. సొంతం కూడా పేర్కొన్నారు. అలాగే కూటమికి వచ్చిన సీట్ల గురించి ప్రస్తావించారు. ఈ లెక్కన కడపలో ఏదో జరుగుతోందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. వీటిని చూసిన కొందరు నాయకులు మాత్రం ఈ ఫ్లెక్సీ గోలేంటి? అంటున్నారు. మరికొందరైతే కావాలనే ఈ విధంగా చేయిస్తున్నారని చెప్పేవాళ్లే లేకపోలేదు. ఈ ఫ్లెక్సీ వార్ రాబోయే రోజుల్లో ఎటువైపు దారి తీస్తొంది వేచి చూడాలి.







