Mahaa Daily Exclusive

  నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్‌ రద్దు: మంత్రి పొన్నం

Share

రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా HMDA గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో వాక్ థాన్ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రోడ్ సేఫ్టీపై అవగాహన చాలా అవసరం.. ఈ అవగాహన వల్ల మనం అందరం ఒక్కొక్కరం ఒక్కరిని కాపాడినా చాలా సంతోషం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేస్తాం. ఇది అందరి సామాజిక బాధ్యత.. అందరం పాటిద్దాం’ అని అన్నారు.