Mahaa Daily Exclusive

  గద్దర్ అన్న.. నువ్వు లేని లోటు ఎన్నటికీ తీరదు: భట్టి

Share

ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనను స్మరించుకున్నారు. ‘సమాజంలో అసమానతల పైన ఎన్నో పోరాటాలకు ఊపిరి పోస్తివి.. నీ పాటతో తెలంగాణకి ప్రాణం పోస్తివి. తెలంగాణ నుండి మొదలుకొని ప్రజా యుద్ధ నౌకగా ప్రపంచమంతా నీ పాటతో పరిచయమేర్పరుచుకొని గొప్పగా జీవించావు సోదరా. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఎంతో ఆప్యాయతగా.. అన్నగా, ఆప్తుడిగా ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటూ నన్ను నడిపించావు. నీవు లేని లోటు ఎన్నటికీ తీరదు’ అని Xలో ట్వీట్ చేశారు.