Mahaa Daily Exclusive

  ఆన్ గోయింగ్ పథకాలు ఆగే ప్రసక్తే లేదు అతిత్వరలో పంచాయతీ ఎన్నికలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్

Share

పథకాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ఆన్ గోయింగ్ పథకాలు ఆగే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో క్రెడిబులిటీ ఉన్న నాయకునిగా చెబుతున్నానన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ఎవరు ఆందోళన చెంద్దన్నారు. ఇంతకంటే మంచి పాలన ఇంతవరకు నేను చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మంచి బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తున్నదన్నారు. ఇన్ని పథకాలు తక్కువ వ్యవధిలో ఎవరు అమలు చేయలేదన్నారు. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలో నిర్వహిస్తామని, ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తిని తానన్నారు. క్యాబినెట్ విస్తరణ సీక్రెట్… ఇప్పుడే చెప్పలేమన్నారు.
……….