మాజీ సీఎం కేసీఆర్ కొడుక్కి పని పాట ఏమీ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ గతిలేరని అన్నారు.దానిపై దృష్టి పెట్టకుండా.. నాపై ఎపుడూ ఏడుస్తారు.. అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ను సీఎం ఎందుకు అరెస్ట్ చేయిస్తలేరని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, ఈ-ఫార్ములా వన్, బావమరిది ఫామ్ హౌజ్ డ్రగ్స్ పార్టీ కేసుల్లో చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బిడ్డా.. నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం బయటపెడతా.. అంటూ కేటీఆర్ పై ఫైరయ్యారు.
Post Views: 83








