ఎస్ ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు. “తెలంగాణలో సొరంగం పైకప్పు కూలిపోవడం తో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు సొరంగం లోపల చిక్కుకున్న వారితో, వారి కుటుంబాలతో ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విపత్తు సహాయక బృందాలు ఆపదలో ఉన్నవారిని త్వరితగతిన వెనక్కి తీసుకురావడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నాయని నాకు సమాచారం అందింది.” అని అందులో పేర్కొన్నారు.
రాహుల్ ను కలిసి మధుయాష్కీ
ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని మధుయాష్కీ శనివారం కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బిసి కులగణనపై వివరించారు. ఇటీవల కాంలో ముఖ్యమంత్రి పనితీరుపై మధుయాస్కీ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Post Views: 115








