విశాఖపట్నంలో సినీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ‘రామానాయుడు స్టూడియో’కు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. ‘ఈ స్టూడియో కోసం నగరంలో 35 ఎకరాల భూమి కేటాయించారు. అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వంలో ప్రయత్నించారు. దీనిపై నేను సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆపాను. ఇప్పటివరకు ఆ భూమిని స్టూడియో కోసం వాడలేదు’ అని ఆయన తెలిపారు.
Post Views: 137








