Mahaa Daily Exclusive

  ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి జరిగే హానిని యువత గుర్తించాలి: ప్రత్తిపాటి

Share

ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి జరిగే హానిని యువత గుర్తించాలని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. “మున్సిపల్‌ కమిషనర్, అధికారులు ముందుచూపుతో పనిచేయాలి. వెంటనే ఈ-వ్యర్థాల సమస్య పరిష్కరించకపోతే బాధ్యులపై తీవ్రచర్యలు తీసుకుంటాం.” అని అన్నారు.