Mahaa Daily Exclusive

  తెలంగాణ రాష్ట్రంలో రైతు బిడ్డకు టాప్ ర్యాంక్ ..!

Share

పోచారం గ్రామానికి చెందిన రైతుబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి విద్యా సంవత్సరంలో ప్రధమంగా నిలిచింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారానికి చెందిన నగేశ్ గౌడ్ సబిత దంపతుల కుమార్తె శ్రీవార్షిక, ఎంపీసీలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించింది. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించి, ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రధమ ర్యాంకర్గా రైతు బిడ్డ నిలవడం గర్వకారణం. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేశారు.