Mahaa Daily Exclusive

  జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన..!

Share

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉగ్రదాడి పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి వాటిపై రాష్ట్ర, కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.