ప్రభుత్వ, ప్రయివేటు సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టిసి డిపోలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో రెండు వేల ఎలక్ట్రికల్ బస్సులు రోడ్లపై తిరగడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆర్టిసిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో 150 డిపోలలో ప్రతి డిపోకు కొత్తగా 20 బస్సులు మంజూరు చేశామని చెప్పారు.
Post Views: 126








