Mahaa Daily Exclusive

  విజయ్‌కు తప్పిన ప్రమాదం.. ఒక్కసారిగా పైకి దూకిన అభిమాని…!

Share

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అభిమాని చెట్టుపై నుంచి విజయ్ వాహనంపైకి దూకాడు. దీంతో విజయ్ షాక్ అయ్యాడు. తర్వాత అభిమానిని పిలిచి పార్టీ కండువా కప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం విజయ్ ‘జన నాయగన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇదే అతని చివరి మూవీ అని కూడా ప్రకటించారు.