Mahaa Daily Exclusive

  భారతీయులు ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఇదే: మంత్రి సత్యకుమార్

Share

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విశాఖపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ దాడిపై స్పందిస్తూ.. భారతీయులందరు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇదేనంటూ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరించారు. 370 రద్దులో కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం జీర్ణించుకోలేక ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.