Mahaa Daily Exclusive

  గులాబీ.. వరం,,గల్ పాతికేళ్ళ పతాక నేడు భారీ సభ.. గులాబీశ్రేణులన్నీ అదే బాట కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి..!

Share

ఓరుగల్లు సభను గులాబీపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాతికేళ్ళ పార్టీకి, పోరాటపటిమకు ప్రతీకగా ఓరుగల్లు సభ నిలిపింది. పది లక్షలమందిని ఈ సభకు తరలించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా ఆదివారం జరుగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సందర్భంగా తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి కదలిరావాలని సూచించారు. గులాబీ సభ కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలిస్తోంది. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సభ కావడంతో సభకు హాజరయ్యే వారంతా గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. చారిత్రక సభలో కేసీఆర్ గారి ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే వరంగల్ దారులన్నీ గులాబీనేతలతో కిటకిటలాడుతున్నాయి.