Mahaa Daily Exclusive

  పాస్టర్‌ ప్రవీణ్‌ రీ-పోస్టుమార్టం కోరుతూ పిల్‌ వేశా: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌

Share

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి నేపథ్యంలో రీ-పోస్టుమార్టం కోరుతూ హైకోర్టులో పిల్‌ వేశానని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ చెప్పారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లో నిపుణులు లేదా నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో వైద్యులతో రీ-పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు ఇప్పటికీ పోస్టుమార్టం నివేదిక బయట పెట్టలేదన్నారు.