వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. గుంటూరు కోర్టు రూ.10వేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో, కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే ప్రతి శనివారం గుంటూరు పాలెం పీఎస్‌లో రెండు నెలలు సంతకం చేయాలని ఆదేశించింది. కాగా మార్చి 10న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌తోపాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో గోరంట్ల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Post Views: 199








