బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని నాదర్గుల్,విజయలక్ష్మి కాలనీ ఫేస్1 లో రోడ్ ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వర్షం నీరు, డ్రైనేజీ ఎలా పోతుందని ప్రశ్నించారు. గతంలో కనెక్టివిటీ రోడ్డుగా చూపెట్టి నేడు ఫ్లాటుగా నిర్మాణాలు చేపట్టడం పై మండిపడ్డారు. రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడుతున్నారని గతంలో మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రోడ్డును కబ్జా చేసి కడుతున్న నిర్మాణాన్ని తీసివేయాలని బడంగ్ పేట్ మున్సిపల్ అధికారులను కోరారు. వర్షం నీరు, డ్రైనేజీ కిందకు పోకపోతే కాలనీ చెరువుల మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
Post Views: 66








