Mahaa Daily Exclusive

  గ్రూప్‌-1 నియామకాలపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్​ చేసిన టీజీపీఎస్ సీ రేపు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ…!

Share

తెలంగాణలో గ్రూప్​-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపి వేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్​ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం నియామకాలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ధ్రువపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉత్తర్వులను సవాల్​ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సింగిల్ బెంచ్​కు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై సోమవారం జరగాల్సిన విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారానికి వాయిదా వేశారు.