Mahaa Daily Exclusive

  ఆదివాసి ప్రజలకు అండగా ఉంటాం మావోయిస్టులకు సహాయం చెయ్యొద్దు గ్రామాల్లోకి కొత్తవారు వస్తే సమాచారం ఇవ్వండి భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్…!

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చర్ల పోలీసుల ఆధ్వర్యంలో చర్ల మండలం లోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు ఎర్రంపాడు గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు.కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే మహిళలకు,చిన్న పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని,అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు సూచించారు.కార్యక్రమంలో చర్ల సీఐ రాజువర్మ,ఎస్సై లు కేశవ,కార్తీక్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.