Mahaa Daily Exclusive

  ఎం.ఎల్.ఏ.అంటే ఫ్లవర్ అనుకుంటిరా…? -నాకు తెలియకుండానే నా పరిధిలో అభివృద్ధి పనులా…..? మంత్రి తుమ్మల…!

Share

ఎమ్మెల్యే అంటే ఫ్లవర్ అనుకొంటిరా….? ఏమి…? ఫైర్…
అంటూ ఆర్.అండ్ బి శాఖాధికారుల తీరుపై స్ధానిక అశ్వారావుపేట శాసన సబ్యులు జారె ఆదినారాయణ తీవ్ర ఆగ్రహంతో ఫైర్ అయ్యారు. మండలంలోని పూసుకుంట ,కటుకూరు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏకంగా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎదురు గానే గాంభీర స్వరంతో రవాణాశాఖ అధికారుల తీరుపై ఎమ్మేల్యే జారె ఆగ్రహించారు. కొండ రెడ్ల గిరిజన గ్రామాల్లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లు ,ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. ఐతే షెడ్యూల్ ప్రకారంగా మూడు హై లెవల్ బ్రిడ్జి పనులను ప్రారంభించాల్సి ఉంది. తదుపరి మరికొన్ని సంక్షేమ పధకాలను కొండరెడ్లకు పంపిణీ చేసే విధంగా షెడ్యూల్ తయారు చేశారు. ఇంతవరకు మాత్రమే ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కు తెలిసిన సమాచారం.

15 కోట్ల వ్యయంతో 10 కి.మీ.బీటి రోడ్డు పనుల కు శంఖుస్థాపన :

వినాయకపురం ఆర్ అండ్ బి రోడ్ నుండి పూసుకుంట ,కటుకూరు మీదుగా రాచన్నగూడెం వరకు 15కోట్ల వ్యయంతో బిటి రోడ్డు నిర్మాణ పనులను శంఖుస్థాపన చేయాలని ఎమ్మేల్యేను కోరగా ….తన షెడ్యూల్ లో లేకుండా ఎలా చేయాలని ప్రశ్నించారు. తన నియోజకవర్గ పరిధిలో తనకు తెలియకుండా అభివృద్ధి పనులా…? అంటూ ఆర్ అండ్ బి అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే అంటే మీకు లెక్కలేదా….? ఈ ప్రాంతం ఎమ్మేల్యే ని నేను అంటూ తీవ్ర మనస్ధపం చెందారు.

సారీ సార్…. మీరంటే గౌరవం , కానీ నేను రాను :

వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ఓపికగా ఎమ్మేల్యే జారె ను బ్రతిమాలుతూ ,చేయి పట్టుకొని తన కారులో తీసుకువెళ్ళే ప్రయత్నంలో , సారీ సార్….మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఓ ఎమ్మేల్యే కు కనీస సమాచారం లేకుండా తన పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే…ఇంకా నేనెందుకు సార్….మిగతా కార్యక్రమాలకు నేను రాను ,మీరే చేసుకోండి …అంటూ తీవ్ర మనస్ధాపం చెందారు. ఐనప్పటికీ తుమ్మల పెద్దమనసుతో జారె ను విడవకుండా సర్దుబాటు చేసి కార్యక్రమంలో పాల్గొనే విధంగా సముదాయించారు. తుమ్మల కారులో తీసుకొని వెళ్ళడంతో 15కోట్ల బిటి రహదారి పనులకు శంఖుస్థాపన లు చేయకుండా నే ముందుకు సాగారు. దీంతో బిటి రోడ్డు పనులు నిలిచినట్లైంది.