Mahaa Daily Exclusive

  మోగిన సమ్మె సైరన్ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మిషన్ భగీరథ ఈ ఈ నరసింహ గౌడ్ కు సిఐటియు వినతి పత్రం ..!

Share

తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో మే 20న జరిగే దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె సంబంధించిన మిషన్ భగీరథ ఇఇ నరసింహ గౌడ్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి. జగదీష్, సిఐటియు యాచారం మండల కన్వీనర్ ఎస్ చందునాయక్ మాట్లాడుతూ… కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం బరితెగించి కార్పొరేట్ మతోన్మాదులకు అనుకూలంగా, పేద ప్రజలకు, కార్మికులకు వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తుందని అన్నారు. అనేక త్యాగాలు, రక్త తర్పణలతో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కాంటాక్ట్ కార్మికుల చట్టం 1970తో పాటు 29 కార్మికుల చట్టాలను రద్దు చేసి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని మోడీ ప్రభుత్వం తహతహలాడుతుందని అన్నారు. మరోపక్క దేశ ప్రజలు కూడబెట్టుకున్న జాతి సంపదను సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను నేషనల్ మానీటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపీ) పేరుతో బడా బాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని అన్నారు. జాతీయ రహదారులు, విద్యుత్ స్టేషన్లు, రైలు, రైల్వే స్టేషన్లు, బొగ్గు గనులు, టెలికం టవర్లు, విమానాశ్రయాలు,ఒడరేవులు, ఎఫ్ సి ఐ గోడౌన్లు, క్రీడ మైదానాలతో సహా ప్రజా ఆస్తులన్నిటిని కార్పొరేట్లకు అమ్మేస్తుందని అన్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో విద్య, వైద్యం, ఉపాధి హామీలాంటి సామాజిక సంక్షేమాలకు నిధులు తగ్గించిందని అన్నారు. నిత్యవసర వస్తువులపై అధిక పన్నులు విధిస్తూ పేదలపై బారాలు మోపిందని అన్నారు. వంట గ్యాసు, పెట్రోల్ ,డీజిల్,నూనె, పప్పులు ,కూరగాయలు అని రకాల వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విడిచిందని అన్నారు.
మిషన్ భగీరథ స్కీమ్లో పనిచేస్తున్న పంపు ఆపరేటర్ లైన్మెన్ ఫిల్టర్ ఎలక్ట్రీషియన్ ట్యాంక్ క్లీనర్ తదితర కేటగిరిలో పనిచేస్తున్న కార్మికులందరికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉరితాలుగా మారే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని, కార్మికులకు ప్రభుత్వాన్ని మధ్య కంపెనీ కాంట్రాక్టర్ జోక్యం లేకుండా ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని, బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ బోనస్ వారంతపు సెలవు ఇవ్వాలని అన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్మిక – ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, ఉద్యోగ భద్రతలు కల్పించాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో, పని బంద్ చేసి మిషన్ భగీరథ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మిషిన్ భగీరథ యూనియన్ అధ్యక్షులు యాదయ్య, యూనియన్ రాష్ట్ర నాయకులు బాలరాజ్, యూనియన్ ఉపాధ్యక్షులు బుగ్గ రాములు, యూనియన్ సహాయ కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు