చిన్న వయసు లోనే భర్త మృతి చెందడం తో పిల్లల పోషణ, చదువులు భారంగా మారి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కాజిపేట బాపూజీ నగర్ కు చెందిన కొల్లూరి అరుణకు అండగా నిలిచిన మన సనాతన హిందూ సేవా సమితి సభ్యులు. వీరి ద్వారా పేదరాలైన అరుణ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం తో పాటు నిత్యావసర సరుకుల అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మన గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు ప్రతాపగిరి గణేష్, గ్రూప్ సభ్యులు నోముల మహేష్ బాబు, వైట్ల నాగరాజు, దీకొండ అమర్నాధ్ పాల్గొన్నారు.
Post Views: 35








