Mahaa Daily Exclusive

  అధికారుల నిర్లక్ష్యం వల్లే నిషేధిత జాబితాలో మా భూమిని.. చెట్టుకు తలకిందకు వేలాడుతూ వినూత్న నిరసన…!

Share

రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల, గత కొన్ని రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో వినూత్న నిరసన తెలిపాడు. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్ పల్లి పటేల్ గూడకు చెందిన వుల్లింతల జీవన్ అనే వ్యక్తికి సర్వే నంబర్ 374లో 1ఎకరా 32 గుంటలు భూమి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆ భూమిని 20 ఏళ్ల కిందట తన తండ్రి ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమికి కొత్త పాస్ బుక్, పాత పాస్ బుక్, టైటిల్ డీడ్, పహానీ పత్రాలు అన్నీ ఉన్నా గతంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులతో సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్వే నంబర్ లో పడింది. ప్రస్తుతం ఈ భూమిని అధికారులు నిషేదిత జాబితాలో చేర్చారనీ జీవన్ వాపోయాడు. అధికారులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగిన సమస్యకు పరిష్కారం దొరుకడం లేదనిచెప్పారు. ఇదిలా ఉండగా అసలు సీలింగ్ హోల్డర్ రెండు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడని, దీనిపై పూర్తి ఆధారాలతో రెవెన్యూ శాఖకు, కలెక్టర్, తహశీల్దార్, ఆర్డీవో ఆఫీసులకే గాక ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వందకు పైగా లేఖలు రాసినా స్పందన కరువైందని బాధితుడు తెలిపాడు. ఇలా సంవత్సరం పాటు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో వాపోయాడు. ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి, పట్టా భూమిగా తనకు తిరిగి ఇప్పించాలని అంటున్నారు. ఇక దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతూ.. తన భూమిలోనే ఉన్న వేప చెట్టుకు భూమి పత్రాలను కట్టడంతో పాటు అదే చెట్టుకు తాను కూడా తలకిందులుగా వేలాడుతు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. గతంతో కూడా బాధితుడు ఎమ్మార్వో కార్యాలయంలో తలకిందుకే కాలు మీదికి చేసి నిరసన తెలిపాడు. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు. ఎమ్మార్వో మాత్రం తనకేం పట్టణ పట్టనట్టుగా వ్యవహరిస్తుందని బాధితుడు వాపోయాడు. ఇది ముమ్మాటికీ రెవెన్యూ అధికారుల తప్పిదమేనని, నా సమస్యకు పరిష్కారం కల్పించాలని ఆవేదనతో రెవెన్యూ ఉన్నతాధికారులను జీవన్ వేడుకున్నాడు.