సూర్యాపేట జిల్లా సమాచార రక్షణ హక్కు చట్టం 2005,మేళ్ళచెరువు నూతన మండల అధ్యక్షులుగా అన్నేపంగు ఉపేంద్రను నియమిస్తున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ తెలిపారు. అందజేశారు ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అనేది భారత పౌరులకు ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కును కల్పించే చట్టం 2005లో ఆమోదించబడినదని.. ప్రభుత్వ పారదర్శకతను జవాబు దారితనాన్ని మరియు అవినీతిని అరికట్టేందుకు ఉపయోగపడుతుంది. సమాచారం యొక్క ముఖ్య లక్షణాలు పౌరులకు సమాచారం తెలిస్తే వారు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించగలుగుతారు. వారి హక్కులను కాపాడుకోగలుగుతారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పనితీరులో పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు సమాచారం అందుబాటులోకి వస్తుంది అని వారు చెప్పుకొచ్చారు, ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా సమాచార హక్కు చట్టం కార్యదర్శి ఏడుకొండలు పాల్గొన్నారు.








