వేసవి రద్దీ దృష్ట్యా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ( భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్లో మంగళవారం ప్రయాణికులు మరియు రైళ్ల భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి ఎస్సార్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ మట్టే సాయి, ఆర్ పి ఎఫ్ సిబ్బందితో కలిసి స్టేషన్ ప్రాంతం మరియు రైళ్లలో మంటలు కలిగించే వస్తువులు, మాదకద్రవ్యాల రవాణా నియంత్రణ కోసం తనిఖీలు నిర్వహించారు. మరియు రైల్వే ట్రాక్‌లపై అతిక్రమించడం గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు మరియు లగేజీలను తనిఖీ చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు.
Post Views: 56








