Mahaa Daily Exclusive

  సీసిఎస్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…!

Share

భద్రాద్రి కొత్తగూడెం,మహా ;ఈ నెల 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న జిల్లా సిసిఎస్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకొని నిందితులను పట్టుకోవడంలో బాధ్యతగా విధులు నిర్వర్తించినందుకు గాను రాష్ట్ర డిజిపి వీరికి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఆంధ్రా-ఒరిస్సా అటవీ ప్రాంతాల నుండి అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసినందులకుగాను రాష్ట్రంలోనే అధికంగా భద్రాది కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నగదు రివార్డులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేసినా,విక్రయించినా,కొనుగోలు చేసినా అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గంజాయి అక్రమ రవాణా గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్బంగా ఎస్పీ కోరారు.కార్యక్రమంలో సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్,రామారావు