Mahaa Daily Exclusive

  చిందిన నెత్తుటి చుక్కల సాక్షిగా హక్కులు సాధించుకోవాలి – శ్రామికవర్గానికి అండ ఎర్రజెండానే రావులపల్లి రవికుమార్ …!

Share

మహా భద్రాచలం

చిందిన నెత్తుటి చుక్కల సాక్షిగా శ్రామిక హక్కులు సాధించుకోవాలని, కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం నల్లచట్టాలను భేషరతుగా వెనక్కు తీసుకోవాలని, శ్రామికవర్గానికి ఏకైక అండ ఎర్రజెండా మాత్రమే అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్ అన్నారు. మే డేని పురస్కరించుకుని గురువారం భద్రాచలంలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఆయా కేంద్రాల్లోని సిపిఐ, ఏఐటియూసి జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా రావులపల్లి రవికుమార్ మాట్లాడుతూ,కార్మికుల తమ హక్కులు సాధించుకునేందుకు చికాగోలో మే 1వ తేదిన చేసిన భారీ ర్యాలీలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ నాడు చిందిన నెత్తుటి ధారలలో తడిసిన ఎర్ర గుడ్డలే ఈ ఎర్ర జెండా అని అన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాసి నాలుగు నల్లచట్టాలను తెచ్చిందని, వాటిని వెనక్కు తీసుకోవాలని అన్నారు. కార్మికులు, కర్షకులకు, అన్ని వర్గాల ప్రజలకు ఎర్రజెండానే అండ అని ఆ జెండా ద్వారానే ప్రజా స్వామ్యం పరిడమిల్లుతుందని తెలిపారు. కేంద్రంలోని మోడి సర్కార్ కార్మికులపై కత్తికట్టి ఇష్టాను సారంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ దేశ విలువైన సంపదను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలు సాగుతున్నాయని మండిపడ్డారు. మన హక్కుల సాధన కోసం చికాగో స్పూర్తితో ముందుకు సాగుదామని, సామ్యాజ్యవాధ శక్తుల చేతుల్లో మగ్గుతున్న స్రామిక వర్గాన్ని రక్షించుకునేందుకు ఎర్రజెండాలను మరింత ఎరుపెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ కన్వీనర్ మారెడ్డి శివాజీ, ఏఐటియూసి కన్వీనర్ కంబంమెట్టు శ్రీనివాస్, మహిళా సమాఖ్య కన్వీనర్ బేరు వరలక్ష్మీ, ఎస్విఎస్ నాయుడు, భద్రాద్రి వెంకటేశ్వరరావు, కరెడ్ల సురేష్ నాయుడు, త్రిమూర్తులు, మహేష్, కొండబాబు, కిలిమి ఎల్లారెడ్డి, కుమారి, వెంకటమ్మ, వెంకన్నతో పాటు కారు, ఆటో స్టాండ్ కార్మికులు, ఏరియా ఆస్పత్రి శానిటేషన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు