Mahaa Daily Exclusive

  ఆందోళన వద్దు… ప్రతీ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఇంచార్జ్ తహసీల్దార్ కరుణశ్రీ..!

Share

కూసుమంచి, మే 1, మహా:

కూసుమంచి మండలం చేగొమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఏసీఎస్ )ఆధ్వర్యంలో… ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రంలో కల్లాలో ఉన్న మొత్తం వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంచార్జ్ తహసీల్ధార్ కరుణ శ్రీ భరోసా కల్పించారు. గురువారం ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ 17 శాతం లోపు తేమ కలిగి,తాలు, చెత్త చెదారం లేకుండా వ్యవసాయ శాఖ అందజేసిన జల్లెడ యంత్రాలతో తూర్పరపట్టి ప్రభుత్వం ప్రకటించిన నాణ్యత ప్రమాణలకు అనుగుణంగా ఉండే విధంగా చూడాలని, తేమ శాతం 17 మించకుండా చూడాలని కోరారు. వాతావరణంలో మార్పు వచ్చి అక్కడక్కడా వర్షం పడే సూచనలు కన్పిస్తున్నాయని, దాన్యం రాసులు తడవకుండా రైతులకు అవసరం మేరా టార్పాలిన్ లు అందజేయటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ప్రభుత్వ నింబందనల ప్రకారం ధాన్యం రైతులు సిద్ధం చేసిన 18 గంటల్లో కాంటాలు పెట్టి మిల్లర్లకు తరలించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.చేగొమ్మ సొసైటీ సిబ్బంది రైతులకు అన్ని రకాల సహాయ సహకారం అందజేయటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అన్నదాతలు ఎవరూ కూడా దళారులను నమ్మి వడ్లను తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. ఇప్పటికైనా ఊహజనితమైన అపోహలు నమ్మి ఆందోళన చెందవద్దని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూనే మరో 500 క్వింటాకు బోనస్ ప్రకటించిందని సన్నధాన్యం రైతులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్దిపోందాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సావదానంగా సమాదానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో రామకృష్ణ, సొసైటీ చైర్మన్
బడ్డెటి శ్రీను,నెలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొండపర్తి సురేష్, చెగోమ్మ మాజీ ఉపసర్పంచ్ బత్తుల నాగేశ్వరరావు, రైతు నాయకులు నర్ర కోటయ్య, మదినేని మోహన్ రావు, వెంకన్న,మల్లి బోయిన లింగయ్య,కేశ్వాపురం గ్రామస్థులు పోటు లెనిన్, పోటు తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు..