Mahaa Daily Exclusive

  కారేపల్లి మండలంలో వాడ వాడలా ఎగిరిన ఎర్ర జెండా పాటిమీదిగుంపులో మే డే ప్రదర్శన ..!

Share

కారేపల్లి, మహా ,

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే ను కార్మిక, కర్షకులు గురువారం కారేపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు.. కారేపల్లి లో సిపిఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కారేపల్లి, కారేపల్లి క్రాస్‌ రోడ్‌లోని పార్టీ కార్యాలయాలు, విశ్వనాధపల్లి, బక్కలతండా, ఉసిరికాయలపల్లి, చీమలపాడు, బాజుమల్లాయిగూడెం, పాటిమీదిగుంపు, మాధారం, గుంపెళ్ళగూడెం, మొట్లగూడెం, మాణిక్యారం, ఎర్రబోడు, గాదెపాడు, ఒడ్డుగూడెం,గాంధీనగర్‌, రేలకాయలపల్లి, చర్లపల్లి , మడెంపల్లి, బోడుతండా, చింతలతండా, తవిసీబోడు, గుడితండా గ్రామాల్లో మేడే సంధర్బంగా ప్రధాన కూడళ్లలో ఎర్రని తోరణాలతో అలకరించి ఎర్రజెండాను ఎగరవేసి ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. పాటిమీదిగుంపులో ర్యాలీ, నిర్వహించగా బాజుమల్లాయిగూడెంలో మోటర్‌ సైకిల్‌ ర్యాలీ జరిపారు. ఈసందర్బంగా జరిగిన సభల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, వజ్జా రామారావు, మాజీ సర్పంచ్‌ బానోత్‌ బన్సీలాల్‌ మాట్లాడారు. సీపీఐ(ఎం) నాయకులు కరపటి సీతారాములు, కల్తి రామచంద్రయ్య, ముండ్ల ఏకాంబరం, అన్నారపు కృష్ణ, బందేలి, కె.ఉమావతి, ఇల్లంగి పిచ్చయ్య, పండగ కొండయ్య, కేసగాని ఉపేందర్‌, దాసరి మల్లయ్య, రేగళ్ల మంగయ్య, కుర్సం శ్రీను, బోజెడ్ల గోవిందరావు, ఎస్‌కె.సైదులు, ఇమ్మడి నర్సయ్య, సురభి కొండలు, వల్లభినేని మురళి, పాపినేని నాగేశ్వరరావు, భూక్యా లక్ష్మన్‌, ఇస్మాయిల్‌, కేసగాని రాంమూర్తి, ఈసం సలీం, ఎజ్జు రత్నం, దారావత్‌ వినోద్‌, తేజావత్‌ చందర్‌, ఎరిపోతు భద్రయ్య, మన్నెం బ్రహ్మయ్య, శేరు లలితమ్మ, పోతురాజు చందర్‌రావు, పుల్లయ్య, యనమగండ్ల రవిబాబు, కొండల్‌రావు, శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో
కారేపల్లిలో బిల్డింగ్‌ వర్కర్స్‌, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ), గ్రామపంచాయతీ వర్కర్స్‌ ఆధ్వర్యంలో సినిమాహాల్‌ సెంటర్‌లో అధ్యక్షులు కేలోత్‌ రవి, ఫారెస్టు ఆఫీస్‌ సెంటర్లలో హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ ఆరెల్లి శ్రీరాములు మేడే పతాకాన్ని అవిష్కరించారు. ఉసిరికాయలపల్లి సోలార్‌ ప్లాంట్‌ వద్ద మేడే ను జరిపారు. ఈకార్యక్రమంలో బిల్డింగ్‌ వర్కర్‌ యూనియన్‌ నాయకులు శనగ రాంబాబు, చిత్తలూరి వీరయ్య, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ముక్కా సీతారాములు, రాబోతు లాలయ్య, కేతిమళ్ల సారయ్య, ఆరెల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
మాధారం డోలమైట్‌లో…
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అనుబంధ మాధారం డోలమైట్‌ మైన్స్‌లో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో వేరువేరుగా మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. యూనియన్‌ కార్యాలయాల వద్ద, మైన్స్‌ ప్రధాన గేటు వద్ద యూనియన్‌ జెండాలను ఎగరవేశారు. ఈకార్యక్రమంలో సీఐటీయు నాయకులు జి.నర్సింహారావు, గుర్రం వెంకటేశ్వర్లు, శ్యామ్‌లాల్‌, బాదావత్‌కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు కొల్లి వీరయ్య, వీరు, ఐఎన్‌టీయుసీ నాయకులు డీ.శ్రీరాములు, నరహరి తదితరులు పాల్గొన్నారు.
వివిధ పార్టీల ఆధ్వర్యంలో
సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, మాస్‌ లైన్‌ ఆధ్వర్యంలో మేడే జరిపారు. సీపీఐ ఆధ్వర్యంలో కారేపల్లి, చీమలపాడు, ఎన్డీ ఆధ్వర్యంలో పేరుపల్లి, మాధారం, మాస్‌ లైన్‌ ఆధ్వర్యంలో పోలంపల్లి, టేకులగూడెం,మాధారం కారేపల్లిలో ఉత్సవాలు జరిపారు. ఈకార్యక్రమాల్లో సీపీఐ నాయకులు తాతా వెంకటేశ్వర్లు, ఉంగరాల సుధాకర్‌, పుచ్చకాయల శ్రీనివాసరావు, తనకం చందర్‌రావు, ఎన్డీ నాయకులు వై.ప్రకాశ్‌, కే.శ్రీనివాసరెడ్డి, కోయిల శ్రీనివాస్‌, వై.జానకీ, భూక్యా శివ, మాస్‌ లైన్‌ నాయకులు ఎన్వీ రాకేష్‌, గుమ్మడి ప్రదీఫ్‌, గుగులోత్‌ తేజా, రావుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.