Mahaa Daily Exclusive

  ప్రజలకు అందుబాటులో పోస్ట్ ఆఫీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజలకు పోస్ట్ ఆఫీస్ ను వినియోగించుకోవాలి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మంచిరేవులలో నూతన పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ ప్రారంభించారు. నార్సిగి మున్సిపాలిటీ పరిదిలోని మంచిరేవులలో పాత గ్రామపంచాయతి కార్యాలయం సమీపంలో నూతన పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వృద్దులకు, వితంతులకు, సామాజిక పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిరేవులలో పోస్ట్ ఆఫీస్ శాఖ ఏర్పాటు చేయడం అర్శించదగ్గ విషయమని అన్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలు ఎన్నో సేవలను పొందవచ్చు అన్నారు. ఈ కార్యాలయం నర్సింగ్ మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులో రావడం చాలా మంచి పరిణామం, ప్రజలు ఈ యొక్క శాఖను వినియోగించుకోవాలని తెలిపారు. పోస్ట్ ఆఫీస్ లో పేద ప్రజలకు డబ్బులను జమ చేసుకునే విధంగా అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, ప్రజలు, పలువురు పాల్గొన్నారు.