కాటారం, మహా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రజా భరోసా వాలీబాల్ క్రీడలు పలిమెల మండల కేంద్రంలో గురువారం ఘనంగా ముగిసాయి. ఈ క్రీడా పోటీల్లో చత్తీస్గడ్, బీజాపూర్, మహారాష్ట్ర, గడ్చిరోలి, క్రీడాకారులతోపాటు ములుగు, భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు పాల్గొనగా ములుగు జిల్లా పస్రా మండలం రంగాపూర్ జట్టు విజేతగా నిలిచింది. మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి జట్టు విజేతగా రన్నరప్ గా నిలవగా, మూడవ స్థానం లో భూపాలపల్లి జట్టు నిలవగా, మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా గుమ్మలకొండ జట్టు కన్సోలేషన్ బహుమతి గెలుపొoదింది . విజేతలుగా నిలిచిన జట్లకు నిలిచిన జట్లకు ట్రోఫీలు, మెడల్స్, మెమొంటోలతో పాటు నగదు బహుమతిని ఎస్పీ కిరణ్ ఖరే అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు సక్సెస్ కృషి చేసిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.
క్రీడల వల్ల యువతలో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతుందని, అటవీ గ్రామాల్లో ఉన్న యువత ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయని, క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని, క్రీడా స్పూర్తి అలవర్చుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. అంతకుముందు పలిమెల మండలంలోని వివిధ గ్రామాల యువతకు ఎస్పీ గారు వాలిబాల్ కిట్ లను అందించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, SI లు రమేష్, మహేంద్ర కుమార్, తమాషా రెడ్డి, వాలీబాల్ మ్యాచ్ రేఫరిలు వెంకటేశ్వర్లు, హనుమంతు, శేఖర్, నవీన్ పోలీసు సిబ్బంది, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.








