Mahaa Daily Exclusive

  సమాజంలో చదువుతోనే గుర్తింపు విద్యార్థినులను అభినందించిన మంత్రి సీతక్క..!

Share

తాడ్వాయి, మహా:చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు.పదవ తరగతి పరీక్షలలో ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తాడ్వాయి కి చెందిన విద్యార్థినిలు కబ్బక చైత్రశ్వి తాడ్వాయి మండల ద్వితీయ స్థానం ,మండల తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన దబగట్ల ప్రవీణలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్, విద్యార్థినులను సన్మానించి అభినందనలు తెలియజేశారు.సమాజంలో చదువుతో గుర్తింపు మరియు హోదా లభిస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలకు దీటుగా మెరుగైన విద్య ఆహారం తో పాటు అనేక రంగాలలో నైపుణ్యం కల్పించి విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.