Mahaa Daily Exclusive

  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో రైతుల కు అవగాహన…!

Share

దమ్మపేట ,మే7 -మహా :

మండలంలోని మారప్పగూడెం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బుధవారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ద్వారా రైతులు ఎటువంటి భూముల లో ఏఏ రకాల పంటలు సాగు చేయాలి….? రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువుల వాడకం వలన కలిగే ప్రయోజనాలు వంటి రైతు ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు.

స్థానిక వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట వారి ఆధ్వర్యంలో మారెప్పగూడెం లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల, అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా రసాయన ఎరువులను సమతుల్యంగా వాడాలి అన్నారు. యూరియాను అదేవిధంగా రసాయనాలను తగిన మోతాదులో వాడటం వలన సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక నికర లాభాలు పొందవచ్చు అన్నారు. రైతులు పంటల సాగులో పాటించవలసిన శాస్త్రీయ మెలకువలు గురించి వివరించారు.

వ్యవసాయ సహాయ సంచాలకులు, డాక్టర్ కే. రవికుమార్ మాట్లాడుతూ విత్తనాలు మరియు రసాయనాలు కొనుగోలు చేసినప్పుడు రైతులు తప్పనిసరిగా రసీదులను భద్రపరచుకొని, ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలియపరిచారు. అదేవిధంగా సాగునీరు వినియోగంలో పాటించాల్సినటువంటి శాస్త్రీయ మెలకువలను రైతులకు వివరించారు.

అనంతరం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం. రాంప్రసాద్ భూసార పరీక్షలకు మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, ఏ పోషకాలను పంటలకు ఏం మోతాదులో ఏ విధంగా వాడాలి తెలిపారు.

వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. రమేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకతను రైతులకు వివరించారు.

మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించారు

మండలం ఉద్యాన అధికారి సందీప్ మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగులో పాటించాల్సినటువంటి మెలకువలు, పంట అవశేషాలను భూమిలో కలియ పెట్టుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను గురించి రైతులకు వివరించారు.

అనంతరం చీపురుగూడెం ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బారావు మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని కార్యక్రమాన్ని చేపట్టి శాస్త్రవేత్తలను రైతులకు మరింత చేరువ చేస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషిని అభినందించారు

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు వినోద్, అను బాబు, కేశవరావు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు తో పాటు, మారప్పగూడెం మరియు చీపురుగూడెం రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.