వరంగల్ మహా;
ఇటీవల రాష్ట్రంలో అకాల మరణానికి గురైన 38 మంది జర్నలిస్టులతో పాటు ప్రమాదాలకు, అనారోగ్యలకు గురై మంచం పట్టిన 8మంది జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) అండగా నిలిచింది. తెలంగాణ మీడియా అకాడమీ నుండి అందించే ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాల చేత టీయూడబ్ల్యూజే దరఖాస్తులు సమర్పించింది. హైదరాబాదులో శుక్రవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిల చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణలతో పాటు ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్, రాష్ట్ర కార్యదర్శులు కే.శ్రీకాంత్ రెడ్డి, జి.మధుగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్ కుమార్, గౌస్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్షులు శంకర్ గౌడ్, లు పాల్గొన్నారు.








