కోరుట్ల, మహా:
కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ… మన కోరుట్ల డిపో నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రెండు రాజధాని AC బస్సులు ఉండేవి.ఆ తర్వాత క్రమంగా ప్రయాణికుల యొక్క మంచి ఆదరణతో కోరుట్ల డిపో నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ప్రతిరోజు 4 బస్సులు (2 AC 2 NON AC) నడుస్తున్నాయి. అలాగే కోరుట్ల నుండి కనిగిరి పామూరు మరియు కనిగిరి వింజమూర్ కి కూడా రెండు బస్సులతో మొదలయి ప్రయాణికుల మంచి ఆదరణతో 4 (NON AC) బస్సులు నడుస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు వాట్సప్ గ్రూపులలో ఈ రోజు లేదా రేపు కోరుట్ల నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కోరుట్ల కి ఈ సమయానికి వెహికల్ ఖాళీగా వెళుతుంది వెళ్లేవారు ఉంటే కాల్ చేయండి అని మెసేజ్ లు వస్తున్నాయి. అలాగే కనిగిరి పామూరు ఆంధ్ర సర్వీసులకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తున్నవి.కావున మెసేజ్ లను చూసి కాల్ చేసి ఆ వెహికల్ లో వెళ్ళిపోతున్నారు. అలాగే ట్రావెల్స్ లను బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. దీనివలన కోరుట్ల నుండి ఎయిర్ పోర్ట్ కి వెళ్లే వారి సంఖ్య అలాగే కనిగిరి పామూరు మరియు వింజమూరు వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి బస్సులు తగ్గిపోయే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణాన్ని పొంది ఇంకా కొంచెం మంచిగా ఆదరిస్తే మరిన్ని బస్సులు పెరిగే అవకాశం కలదు. కావున ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ప్రతి ఒక్కరు ఆర్టీసీని ఆప్యాయతతో, ప్రేమతో ఆదరించగలరని ఒక ప్రకటనలో తెలపడం జరిగింది








