వరంగల్ మహా; భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు అందజేసి భూ సమస్యలు పరిష్కరించు కోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు.
భూ భారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్ ప్రాజెక్టుగా వర్ధన్నపేట మండలం ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వర్ధన్నపేట మండలంలోని చెన్నారం గ్రామంలో భూ భారతిలో భూ సమస్యలపై రైతులు అందించిన దరఖాస్తులను ,
రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్లను పనితీరును కలెక్టర్
పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు చట్టంపై అవగాహన కల్పించి, వారి సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.
అనంతరం చెన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుని ఎంపికకు క్షేత్ర స్థాయిలో స్థితిగతులను పరిశీలించి నిబంధనల మేరకు అత్యంత నిరుపేదను పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ విజయ్ సాగర్, రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.








