Mahaa Daily Exclusive

  ఎడిట‌ర్ ఇంటిపై దాడిని ఖండించిన జ‌ర్న‌లిస్టులు..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఏపీ పోలీసులు ప‌త్రికా స్వేచ్చ‌ను కాల‌రాస్తు పాత్రికేయుల ఇళ్ల‌పై దాడుల‌కు దిగ‌డాన్ని ఆదిలాబాద్ జ‌ర్న‌లిస్టులు ఖండించారు. శుక్ర‌వారం ప‌ట్ట‌ణం లో ప్రింట్ ఎల‌క్ట్రానిక్ మీడియా జ‌ర్న‌లిస్టులు నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. ప్రెస్ క్ల‌బ్ నుండి క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. ఏపీ పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేసారు. జ‌ర్న‌లిస్టుల ఐక్య‌త వ‌ర్ధిల్లాలి అంటూ నిన‌దించారు. విజ‌య‌వాడ‌లో ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఎడిట‌ర్ ధ‌నుంజ‌య్ రెడ్డి నివాసంలో ముంద‌స్తు అనుమ‌తులు లేకుండా త‌నిఖీల పేరుతో కుటుంబ‌స‌భ్యుల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేసార‌ని జ‌ర్న‌లిస్టులు సురేష్ , కృష్ణ కాంత్ గౌడ్ , ఫిరోజ్ ఖాన్ ఏపీ పోలీసుల తీరును త‌ప్పుబ‌ట్టారు. పత్రికా స్వేచ్చకు భంగం కలిగే విధంగా ఏపీ కూట‌మి ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఎడిటర్ పై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం సరి కాదన్నారు. ధ‌నుంజ‌య్ రెడ్డి పై పెట్టిన కేసుల‌ను వెంటనే విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.అనంత‌రం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో మెమోరాండం స‌మ‌ర్పించారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో జర్న‌లిస్టులు సారంగ పాణి, స‌త్య‌నారాయ‌ణ , శ్రీ‌నివాస్ ,సుధాకర్, వెంకటేష్, అస్మత్, రవి, ప్రవీణ్, సుభాష్, శ్రీకాంత్, నీలేష్ , రాజు , అభిలాష్, అరుణ్ రెడ్డి, వినోద్, నరేష్, సందేశ్,సంతోష్, రాజేశ్వర్, పవన్,శ్రీనివాస్, ద‌త్తు,దీపక్, మహేందర్, విజయ్ రెడ్డి, ప్రవీణ్, రాకేష్, నర్సింగ్, మహేష్, రాము త‌దిత‌రులు పాల్గొన్నారు.