ఆదిలాబాద్ మహా :పెళ్లిళ్ల సీజన్ లో కళ్యాణ వేదికలన్నీ కళకళలాడుతున్నాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పై అభిమానంతో తనను ఆహ్వానించిన వారి వివాహాది శుభకార్యాలకు ఆయన తన శ్రేణులతో కలిసి హాజరయ్యారు. కళ్యాణ మండపాలలో మిత్రులు, శ్రేయోభిలాషులు అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. పట్టణంలోని పలు పంక్షన్ హాళ్ల లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులు ఆశీర్వదించి కంది శ్రీనన్న పెళ్లి కానుకలను బహుకరించారు. ఆయన వెంటకాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,మునిగేల విట్టల్,మొహమ్మద్ రఫీక్,తాజా మాజీ కౌన్సిలర్ సంద నర్సింగ్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, నాయకులు పోరెడ్డి కిషన్,తమ్మల చందు,బండి నరసింహ చారి,ముక్కెర సంతోష్ తదితరులు హాజరయ్యారు.
Post Views: 21








