రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ పట్టణానికి చెందిన క్యామ రాజేష్ నియామకం అయ్యారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఈ మేరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మరియు జిల్లా ఇంచార్జులు రామ్ రెడ్డి, అరవింద్ గార్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ గా నియమితులైన క్యామ రాజేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ గా నియామకానికి ప్రోత్సహించి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు యూత్ కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకుల సహకారంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. అన్ని వర్గాల యువత యొక్క సమస్యలను పరిష్కారిస్తు వారిని ఏఐసిసి నాయకులు లోకసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి మరియు కాంగ్రెస్ ఆలోచనల వైపు మళ్లించేందుకు పనిచేస్తానని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళి అర్హులైన లబ్దిదారులందరికీ ఆరు గ్యారంటీల పథకాలు అందేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యువతకు గొప్ప భవిష్యత్ ఉందని, కాంగ్రెస్ పార్టీనే దేశ రాష్ట్రాల భవిష్యత్తుకు మార్గదర్శకమని క్యామ రాజేష్ ధీమా వ్యక్తం చేశారు.








