భద్రాద్రి కొత్తగూడెం, మే 9 (మహ):
నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన (38) మంది సభ్యులు శుక్రవారం లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహిత్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81 బెటాలియన్ మరియు 141 బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు “ఆపరేషన్ చేయూలో” కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంమరియు తెలంగాణ పోలీసు శాఖ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడిచిపెట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి నిర్మలమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న (38) , పార్టీ సభ్యులు 02, మిలిషియా సభ్యులు, -16, విసిఎంఎస్-07, కెఎఎంఎస్ -06, సిఎన్ఎం-03, జి ఆర్ డి ఎస్-04
లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీసు శాఖ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధ క్యాడర్లలో ఉన్నవారు. తమ ఆయుదాలను విడిచిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోవడం జరుగుతుందని, లొంగిపోయిన అనంతరం వారికి చెందాల్సిన ప్రతిఫలాలను కూడా తక్షణమే అందలా తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ కృషి చేస్తున్న విషయాన్ని గ్రహించి ఇక్కడ లొంగిపోవడం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం అందించే సౌకర్యాలను పొందుతూ తమ కుటుంబ సభ్యులతో కలిసి లొంగిపోయిన వారు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని, ఈ సంవత్సరంజనవరి-2025 నుండి ఇప్పటివరకు నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేసిన 265 మంది మావోయిస్టుసభ్యులువివిధ హోదాలలో , డివిసిఎం 1, ఎసిఎంఎస్ 11, పిఎం 29, మిలిషియా సభ్యులు 92, ఆర్పీసి కమిటీ సభ్యులు 33, డిఎకెఎంఎస్ 47, సిఎన్ఎం మెంబర్లు 30, జిఆర్డీ22
గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ, ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా, ఏజెన్సీ ప్రాంత అభివృద్దిని అడ్డుకుంటూ, ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలు జీవనం సాగించడానికి నిత్యం సంచరించే ప్రదేశాలలో మందుపాతరలను అమర్చుతూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకుల దుశ్చర్యలతో ఆదివాసీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అమాయక ఆదివాసిలను పోలీసు ఇన్ఫర్మార్ల పేరుతో అతికిరాతకంగా చంపడం మరియు హింసించడం జరుగుతున్నది.
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సభ్యులు స్వచ్చందంగా పోలీసుల ఎదుట లొంగిపోము వారి కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని కొత్తగూడెం పోలీసు తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం. లొంగిపోవాలనుకునే మావోయిస్టు సభ్యులు తమ దగ్గరలో గల పోలీస్ స్టేషన్లో గాని లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గాని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు పునరావాసంమరియు జీవనోపాధికల్పించడం కోసంతెలంగాణ ప్రభుత్వం తరుపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనాయకులు జనజీవనస్రవంతిలో కలిసినట్లయితే, వారికి ప్రత్యేకమైననగదు మరియు ఇతరపు నరావాససదుపాయాలుతక్షణమే అందించడానికి పోలీస్ శాఖ కృషిచేస్తుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.








