కారేపల్లి, మహా ,
వ్యవసాయ పనులు లేని సమయంలో పేదల జీవనానికి ఇబ్బంధులు ఉండవద్దని ఉద్దోశంతో వామపక్షాల నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపాధీ హామీ పధకాన్ని తీసుకవచ్చి పేదల జీవితాల్లో వెలుగునింపిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కారేపల్లి మండలంలోని ఉపాధీ పనుల వద్దకు సార్వత్రిక సమ్మెపై వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఎంతో ఉపయోగమైన ఉపాధీ పధకంకు ఏడాదికేడాది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులతో కోత విధిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పేదల కంటే బడా కార్పొరేట్ సంస్ధలే ముఖ్యంగా ఆ సంస్ధలకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులు కాలరాయటం, రైతులకు గిట్టుబాటు ధర రాకుండా నల్లచట్టాలు చేయటం వంటివి చేస్తున్న కేంద్రంపై పోరాటాలతో ఒత్తిడితెద్దామన్నారు. దీనిలో భాగంగా ఈనెల 20న అన్ని కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగస్వాములై గ్రామీణ బంద్‌ను పాటిద్దామన్నారు. ఈకార్యక్రమంలో రమేష్, మల్లమ్మ, వెంకటమ్మ, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.








