ఆదిలాబాద్, మహా: పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధినుండి వచ్చిన చెక్కులను ఆయన లబ్దిదారులకు అందించారు. సోమవారం బేల మండలంలో పర్యటించిన ఆయన పిట్ గావ్ మాజీ సర్పంచ్ జాదవ్ సీతారామ్ కు మంజూరైన రూ.60 వేల చెక్కును ఆయన నివాసానికి వెళ్లి అందించారు. సీయంఆర్ ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని ఆసుపత్రుల్లో డబ్బుల పెట్టి వైద్యం చేయించుకున్నవారికి ముఖ్య మంత్రి సహాయ నిధినుండి ఆర్థిక సాయంకోసం దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు.
Post Views: 21







