Mahaa Daily Exclusive

  ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..!

Share

వరంగల్ మహా;

వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ మైదానంలో సోమవారం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా మంత్రులు, నగర మేయర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లా ప్రగతి గురించి వివరించారు. అనంతరం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వారాజు సారయ్య, శ్రీపాల్ రెడ్డి, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్ లతో కలిసి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.

ఈ సందర్భంగా మంత్రి చేతులమీదుగా రైతులకు విత్తనాలను పంపిణీ పంపిణీ చేశారు.

అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు, ఏర్పాటుచేసిన స్టాల్స్ లను మంత్రి సందర్శించారు.

అంతకుముందు ఖిలా వరంగల్ మధ్యకోటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మంత్రి శ్రీనివాసరెడ్డి , నగర మేయర్ గుండు సుధారాణి, ఎం ఎల్ సి లు బస్వరాజు సారయ్య, శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యే లు రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్ నాగరాజు శాలువాలతో సన్మానించారు.

ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజ్, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు