ముమ్మిడివరం మండల పరిషత్ పరిపాలనాధికారిగా శేషగిరిరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన తులసి కృష్ణ ఉప్పలగుప్తం మండలానికి బదిలీ అయ్యారు. తులసి కృష్ణ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శేషగిరిరావును ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.
Post Views: 87








